ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోరవీందర్ రెడ్డి కృషి : గొంగిడి సునీత 

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోరవీందర్ రెడ్డి కృషి : గొంగిడి సునీత 
  • సర్వీస్ రెగ్యులర్, పీఆర్సీ, ప్రమోషన్ల కోసం పోరాడారు : గొంగిడి సునీత

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. అంకితభావం, పట్టుదలతో పనిచేస్తే ఏ ఉద్యోగి అయినా తన లక్ష్యాన్ని సాధించొచ్చని పేర్కొన్నారు. గత నెల 31న ఉద్యోగ విరమణ చేసిన రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఆదివారం నాగోల్‌లోని ఓ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొంగిడి సునీత హాజరై ఆయన సేవలను అభినందించారు.

43 ఏళ్లుగా హౌసింగ్ కార్పొరేషన్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన రవీందర్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం, తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకం, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కీలకంగా పనిచేశారని సునీత కొనియాడారు. ఉద్యోగుల హక్కుల కోసం నిరసన దీక్షలు, ర్యాలీలు, ఆమరణ దీక్షలు చేపట్టి పోరాటం చేశారని తెలిపారు. ఈ పోరాటాల ద్వారా ఉద్యోగుల సర్వీస్ రెగ్యులర్ చేయించడంతోపాటు పీఆర్సీ, ప్రమోషన్లు సాధించడంలో రవీందర్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ సెక్రటరీ వెంకట్రాంరెడ్డి, ఈశ్వరయ్య, కంది రవీందర్ రెడ్డితోపాటు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.